📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్హుస్నాబాద్ లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 11 మంది పట్టివేత

హుస్నాబాద్ లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 11 మంది పట్టివేత

📰 Generate e-Paper Clip

సిద్దిపేట నవంబర్ 28 (ప్రజావాణి)

హుస్నాబాద్ పట్టణ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి 11 మందిని పట్టుకున్నారు. పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ పి. లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.24,200 నగదు, 5 మోటార్ సైకిళ్లు, 6 సెల్‌ఫోన్లు, 104 పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.పట్టుబడిన వారిలో హుస్నాబాద్, ముల్కనూర్, అక్కన్నపేట మండలంలోని అంతక్కపేట, మాసిరెడ్డి తండా, చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ రవీందర్, పోలీసు సిబ్బంది కుమార్, క్రాంతి, నరేష్, శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని  అక్రమ పేకాట స్థావరాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.