📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజలవాగు,నల్లివారి గూడెం గ్రామాలకు రోడ్డు నిర్మించాలి బీజేపీ నాయకుల డిమాండ్

జలవాగు,నల్లివారి గూడెం గ్రామాలకు రోడ్డు నిర్మించాలి బీజేపీ నాయకుల డిమాండ్

📰 Generate e-Paper Clip

*జలవాగు,నల్లివారి గూడెం గ్రామాలకు రోడ్డు నిర్మించాలి బీజేపీ నాయకుల డిమాండ్*

దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ పోరు దీక్ష

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 28

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని జలవాగు మరియు నల్లివారి గూడెం గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలి నియోజకవర్గం వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లు పుడ్చాలనీ దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పోరు దిక్స కార్యక్రమం చేపట్టారు,ఈ సందర్భంగా నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ,ఎన్నో ఏళ్లుగా ఈ గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు డెలివరీ సమయాల్లో,అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రికి వెళ్లాలన్న,స్కూల్ పిల్లలు బడి వెళ్లాలన్న రవాణా సదుపాయం లేక నానా అవస్థలు పడాల్సి వస్తోందన్నారు,ప్రభుత్వలు మారుతున్నాయి గాని గిరుజనుల బ్రతుకులు మారడం లేదు,మాయ మాటలు చెప్పి ఓట్లు వేపించుకున్న నాయుకులు ఏసీ కార్ లలో తిరుగుతున్నారు-గిరిజనులు బ్రతుకులు మారడం లేదు,ఇప్పటికైనా అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకుని, తక్షణమే స్పందించి జలవాగు,నల్లివారి గూడెం గ్రామాలకు వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు,లేనిపక్షంలో గిరిజన ప్రజలతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు,అనంతరం ఎంఆర్ఓ,ఎంపీడీఓకి వినతిపత్రం అందజేశారు,ఈ కార్యక్రమంలో దమ్మపేట,అశ్వారావుపేట, ముల్కలపల్లి మండలాల నాయకులు పమిడి లక్ష్మీనారాయణ. బీజేపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.