*విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా సృజనాత్మకతను వెలికితీయ్యాలి*
*విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి*
*జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను పకడ్బందీగా నిర్వహించాలి*
*సంగారెడ్డిలో మూడు రోజుల పాటు సైన్స్ ఫెయిర్ నిర్వహణ*
*విద్య వైజ్ఞనిక ఏర్పాట్లపై జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి*
జహీరాబాద్, నవంబర్ 28 (ప్రజావాణి):- విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, వారిలో దాగి ఉన్న సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన-2026 ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి సూచించారు.
సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంటోనీ, శాంతినగర్ పాఠశాలలో డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లపై శనివారం ఆమె 13 కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, సభ్యులతో ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కమిటీకి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఫుడ్ కమిటీ, బాలికల వసతి కమిటీ, స్టేజ్ కమిటీ, మీడియా కమిటీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు.
వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం, సురక్షితమైన వసతి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్‌కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ బాధ్యతలు అప్పగించారు.
సమావేశంలో డి సి ఈ బి సెక్రటరీ లింబాజీ,
ఐదు మండలాల విద్యాధికారులు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, 13 కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
