📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణదీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలి

దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలి

ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి

మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 28

పెద్దపల్లి: కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న ‘దీక్షా దివస్ స్ఫూర్తి’ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరుకానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా శనివారం పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్ మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అలుగునూరు సభకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణ, ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించే అంశాలపై చర్చించారు.

దీక్షా దివస్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మనోహర్ రెడ్డి కోరారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు హాజరై బీఆర్ఎస్ పార్టీ ఐక్యతను, బలాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కదలిరావాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.