📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజోగిపేట శ్రీకృష్ణ గోశాల నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

జోగిపేట శ్రీకృష్ణ గోశాల నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

జోగిపేట శ్రీకృష్ణ గోశాల నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

• గోమాతకు ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ

జోగిపేట | నవంబర్ 28 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

జోగిపేట పట్టణంలోని శ్రీకృష్ణ గోశాల నాలుగో వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఈ వేడుకల్లో జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డి.బి. నాగభూషణం, మల్లికార్జున్ గుప్తా, పట్టణ ప్రముఖులు రంగ సురేష్, చాపల వెంకటేశం, ఎ. రాంబాబు, జగన్ రెడ్డి, పత్తి వీరేశం, దిలీప్ కుమార్ జైన్, బిర్ల శంకర్, మల్లేశం, పల్లె వెంకట రమణ, మున్సిపల్ కౌన్సిలర్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గోసంరక్షణ, గోసేవ ప్రాధాన్యతను చాటిచెప్పేలా నాలుగో వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ ఆనందోత్సాహాలతో సాగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.