📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకంటాత్మకూర్‌లో వెల్లివిరిసిన సంక్షేమ సంబరాలు

కంటాత్మకూర్‌లో వెల్లివిరిసిన సంక్షేమ సంబరాలు

📰 Generate e-Paper Clip

కంటాత్మకూర్‌లో వెల్లివిరిసిన సంక్షేమ సంబరాలు

21 మంది గీత కార్మికులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సర్పంచ్ కొంగంటి తిరుపతి

కంటాత్మకూర్, నవంబర్ 28:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయడంతో కంటాత్మకూర్ గ్రామానికి చెందిన 21 మంది గీత కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కొత్తగా మంజూరైన పింఛన్ నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో గీత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో, గ్రామ సర్పంచ్ శ్రీ కొంగంటి తిరుపతి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో గీత కార్మికులు గౌడ సంఘం కమిటీ హాల్ వద్ద ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, సర్పంచ్ కొంగంటి తిరుపతి మరియు పాలకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ కొత్త పింఛన్లు మంజూరు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరయ్యాయని గీత కార్మికులు, గౌడ సంఘం పెద్దమనుషులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొంగంటి తిరుపతి మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 51 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో 24 వితంతు పింఛన్లు, 5 వికలాంగుల పింఛన్లు, 21 గీత కార్మికుల పింఛన్లు, ఒక ఒంటరి మహిళ పింఛన్ ఉన్నాయని వెల్లడించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఉండి పింఛన్ పొందని వారు ఎవరూ మిగిలిపోకుండా తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.