📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకోటగిరిలో అట్టహాసంగా కేసీసీ సీజన్ 2 నైట్ షాట్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

కోటగిరిలో అట్టహాసంగా కేసీసీ సీజన్ 2 నైట్ షాట్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

📰 Generate e-Paper Clip

కోటగిరిలో అట్టహాసంగా కేసీసీ సీజన్ 2 నైట్ షాట్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

ఎన్నారై కోనేరు శశాంక్,కోనేరు చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్‌షిప్‌తో టోర్నీ నిర్వహణ.

యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను అలవాటుగా మార్చుకోవాలి.

మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్.

క్రీడాభిమానుల కేరింతలు,ఫ్లడ్ లైట్ల వెలుగుల నడుమ కనులపండువగా ఆరంభం.

70కి పైగా జట్ల మధ్య హోరాహోరీగా సాగనున్న పోటీలు.

విజేతకు రూ.30 వేలు,రన్నర్‌కు రూ.20 వేల నగదు బహుమతి,మెమెంటోలు.

ట్రోఫీలను ఆవిష్కరించి,టాస్ వేసి పోటీలను ప్రారంభించిన అతిథులు.

కోటగిరి/ప్రజావాణి:-నేటి యువత మద్యం,డ్రగ్స్,సెల్ ఫోన్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలను అలవాటుగా మార్చుకోవాలని కోటగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బర్ల మధుకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద హై స్కూల్,శ్రీ వేద హై స్కూల్ పక్కన గల మైదానంలో కోటగిరి క్రికెట్ క్లబ్ సీజన్ 2 ఫ్రెండ్స్ షాట్ బౌండరీ నైట్ క్రికెట్ టోర్నమెంట్ కనులపండుగ గా ప్రారంభించారు.విద్యుత్ కాంతులు, క్రీడాకారుల ఉత్సాహం,క్రీడాభిమానుల కేరింతల నడుమ ఈ క్రీడా సంబరానికి అంకురార్పణ జరిగింది.బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు,కోనేరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్నా రై కోనేరు శశాంక్ ప్రధాన స్పాన్సర్‌షిప్‌ తో,కేసీసీ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో మత్తుకు దూరంగా క్రీడలకు దగ్గరగా అనే నినాదంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.ఈ ప్రారంభోత్సవ వేడుకకు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బర్ల మధుకర్,ప్రముఖ సామాజిక సేవాకర్త,బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎం.ఏ.హకీమ్, కోటగిరి,రుద్రూర్ మండలాల బీజేపీ అధ్యక్షులు ఏముల నవీన్,హరికృష్ణ, కోటగిరి ఆర్ఐ సునీల్ రెడ్డి,బీజేపీ నాయకులు సున్నం సాయిలు,పబ్బ శేఖర్,సీనియర్ పాత్రికేయులు గోగినేని హనుమంతరావు,నాయకులు ఏజాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులంతా కలిసి విజేతలకు అందజేయనున్న ఆకర్షణీయమైన ట్రోఫీలను ఆవిష్కరించి,అనంతరం మైదానంలో టాస్ వేసి మ్యాచ్‌లను ప్రారంభించారు.ఈ సందర్భంగా బర్ల మధుకర్ మాట్లాడుతూ.నేటి రోజుల్లో యువకులు నిత్యం సెల్ ఫోన్లకు అతుక్కుపోతూ మద్యం,డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలవుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.యువత పెడదారి పట్టకుండా ఉండేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని,ఆటల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు.యువతను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన ఎన్నారై కోనేరు శశాంక్‌కు ఉమ్మడి కోటగిరి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు.యువత మత్తుకు,చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నదే మా ఆశయం.గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది అని కోనేరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి 70కి పైగా జట్లు నమోదు చేసుకున్నాయని.ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు.టోర్నీలో ప్రతిభ కనబరిచిన విన్నర్ జట్టుకు రూ.30 వేలు,రన్నర్ జట్టుకు రూ.20 వేల నగదు బహుమతితో పాటు మెమెంటో లను అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల ప్రజాప్రతినిధులు,నాయకులు షేరు, శ్రీనివాస్ గుప్తా,సోహెల్,యార్లగడ్డ రవి,కట్టు రమేష్,గోపికృష్ణ,అసద్ ఖాన్, పత్తి సతీష్,కేసీసీ నిర్వాహకులు,కోనేరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, క్రీడాకారులు,యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.