*💥 తెల్లవారుజామున 3:30 కి పెద్దశంకరంపేటలో ఘోర ప్రమాదం! 💥*
*లారీ అదుపుతప్పి బ్రిడ్జిలో ఇరుక్కుపోయింది!*
*బ్రిడ్జి కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది!*
* *నిద్రమత్తుతో డ్రైవింగ్ వద్దు – ఒక్క క్షణం అజాగ్రత్త జీవితానికే ప్రమాదం!*
*మెదక్, ప్రజావాణి న్యూస్ పెద్దశంకరంపేట:* పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161 పై శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో అదుపుతప్పింది. దీంతో లారీ బ్రిడ్జిపై నుంచి దూసుకెళ్లి డివైడర్ మధ్యలోకి వెళ్లి బ్రిడ్జి గోడను బలంగా ఢీకొట్టి ఇరుక్కుపోయింది.
*అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది!*
ఎందుకంటే, సాధారణంగా బ్రిడ్జి కింద ఎప్పుడూ ఏదో ఒక వాహనాలు పెడుతూ ఉంటారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బ్రిడ్జి కింద ఎవరూ లేకపోవడం, ఎలాంటి వాహనాలు లేకపోవడం వలన పెద్ద ప్రాణాపాయం తప్పింది.
ఒకవేళ ఆ సమయంలో కింద ఎవరైనా ఉండి ఉంటే, పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
లారీ డ్రైవర్ కూడా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీశారు.

