జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):జిల్లాలోని రఘునాథపల్లి మండలం, మండలగూడెం గ్రామానికి చెందిన జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోనాసి క్రాంతి తల్లి బోనాసి లక్ష్మి మరణించిన విషయం తెలియగానే చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం మండలగూడెం గ్రామానికి చేరుకొని, బోనాసి లక్ష్మి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాతృవియోగంతో తీవ్ర దుఃఖంలో ఉన్న బోనాసి క్రాంతి, కౌన్సిలర్ బోనాసి రజినిలను ఓదార్చి పరామర్శించారు. తల్లిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బోనాసి లక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనగామ పట్టణ మాజీ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, లింగాజీ, కీసర దిలీప్ రెడ్డి, సాధం మనోహర్, మారబోయిన ప్రకాష్ యాదవ్, మిద్దెపాక స్టాలిన్, తారిక్, ఉల్లెంగుల మధు, ఆరేళ్ల విజయ్, బక్క ప్రవర్ధన్, నరేష్, బుర్ర నరేష్, కనకరాజు, శ్రీధర్, నవీన్, మహేశ్, రవి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

