జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో సభ నిర్వహించే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై నాయకులతో సమగ్రంగా చర్చించారు.
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు పెద్ద సంఖ్యలో హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాజీవ్ చౌరస్తాలో సభా వేదిక ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజలకు సభ స్పష్టంగా కనిపించేలా వేదిక నిర్మాణంపై చర్చించారు.
సభకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు భోజన ఏర్పాట్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాల ఎంపిక, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై చర్చించారు.
సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు.
ఈ దీక్షా దివస్ సభకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గడ్డం కిరణ్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మాజీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ మహేందర్ నాయక్, పాలకుర్తి ఉపసర్పంచ్ గాదెపాక కిరణ్, మాజీ పట్టణ అధ్యక్షులు కడుదుల కరుణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేపాల అశోక్, దస్తగిరి, లకావత్ నాగరాజ్, బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మహమ్మద్ ఇమామ్, దొంతమల్ల గణేష్, ఎండి రాజ్ మహమ్మద్, కోల నారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు.

