దీక్షా దివస్ సభా స్థలాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో సభ నిర్వహించే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై నాయకులతో సమగ్రంగా...