ఘట్కేసర్: ఘట్కేసర్ విద్యుత్ సబ్‌స్టేషన్ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా బాధ్యతలు చేపట్టిన సైదు నాయక్‌ను ఘట్కేసర్ డివిజన్ ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షుడు కేశవ పట్నం ఆంజనేయులు, కార్యదర్శి శశిధరన్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నూతన ఏఈ సైదు నాయక్‌కు శాలువా కప్పి సత్కరించి, బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యుడు బర్ల దేవేందర్ ముదిరాజ్, రిటైర్డ్ ఏఎస్ఐ కాజీపేట సత్యనారాయణ, గోరకంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

