**ప్రతి గడపకూ తాగునీరు.. వేలేరు అభివృద్ధికి బిల్లా యాదగిరి మరో ముందడుగు!**
వేలేరు:మండల కేంద్రంలోని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామపంచాయతీ నిధులతో చేపడుతున్న నూతన తాగునీటి పైపులైన్ పనులను గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో నూతన పైపులైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, విలువైన నీటిని వృథా చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి సహకారంతో వేలేరు గ్రామంలో అభివృద్ధి పనులను నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, వార్డు సభ్యులు రణధీర్ రెడ్డి, సునీల్, గ్రామ పెద్దలు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

