కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వసుధా ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి కుమార్తె ఇందుజా, రిత్విక్ రెడ్డిల వివాహ వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొనుగోటి శ్రీనివాసరావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా సాగాలని వారు ఆకాంక్షించారు.

