*జగ్గారెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – నూతన వధూవరులకు ఆశీర్వాదం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
సంగారెడ్డి లో జరిగిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ వివాహ మహోత్సవంలో నూతన వధూవరులను మంత్రి వెంకట్ రెడ్డి ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో, అన్యోన్యంగా సాగాలని ఆకాంక్షించారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన జంట ను ఆశీర్వదించారు.

