📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు.. ఆదిరెడ్డికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు

పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు.. ఆదిరెడ్డికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు

📰 Generate e-Paper Clip

పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు.. ఆదిరెడ్డికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియామకం..

శాలువాతో ఘనంగా సత్కరించిన యువమోర్చా నాయకులు పుల్లూరి పృథ్విరాజ్

ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి:

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రూపిరెడ్డి ఆదిరెడ్డి నియమితులైన సందర్భంగా బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పట్ల ఆయన చూపిన దీర్ఘకాలిక నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యత లభించడం పట్ల పలువురు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా సీనియర్ నాయకులు పుల్లూరి పృథ్వీరాజ్ రూపిరెడ్డి ఆదిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకం ఆదిరెడ్డికి మాత్రమే కాకుండా జీలకుంట గ్రామంతో పాటు ఓదెల మండలానికి కూడా గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పుల్లూరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాల సాధన కోసం ఆదిరెడ్డి ఎంతోకాలంగా అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, నాయకత్వ లక్షణాలు, కార్యకర్తలతో సత్సంబంధాలు, ప్రజాసేవ పట్ల ఉన్న ఆసక్తికి ఈ రాష్ట్ర స్థాయి బాధ్యత నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా లభించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని నాయకులు సూచించారు. భవిష్యత్తులో ఆదిరెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ రాజకీయ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా సీనియర్ నాయకులు పుల్లూరి పృథ్వీరాజ్, మ్యాడగోని రమేష్, కొక్కునూరి సదన్ కుమార్, గొడుగు బిక్షపతి, రవి, అభిలాష్‌తో పాటు పలువురు బీజేపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రూపిరెడ్డి ఆదిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.