గుడుంబా తయారీదారుని పట్టుకున్న ఎస్ఐ వంశీకృష్ణ
నవంబర్ 24 ప్రజావాణి న్యూస్/సంగెం
30 లీటర్ల గుడుంబా స్వాధీనం 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం నిందితుడికి రిమాండ్
సంగెం మండలం పోచమ్మతండా గ్రామ పరిధిలోని రేఖ్యా నాయక్ తండా శివారులో మంగళవారం ఉదయం సంగెం పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన బానోతు అనిల్ (36), తండ్రి కిషన్, రేఖ్యా నాయక్ తండా నివాసిని అదుపులోకి తీసుకున్నార.అతని వద్ద ఉన్న రెండు క్యాన్లలో సుమారు రూ.12,000 విలువైన 30 లీటర్ల గుడుంబాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గుడుంబా తయారీ కేంద్రాన్ని గుర్తించి, అక్కడ గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
గుడుంబా తయారీ, రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంగెం ఎస్సై వంశీకృష్ణ హెచ్చరించారు. గుడుంబా సేవించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారీకి, విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ జి. రమేష్, కానిస్టేబుళ్లు బి. శ్రవణ్, జి. వేణు, శంకర్ ప్రజల ప్రాణాలు రక్షిద్దామని గుడుంబాను అరికట్టాలని ఉద్దేశంతో గస్తీ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది

