📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగ్రామాల సమస్యలపై ఎమ్మెల్యేకు సర్పంచ్‌ల వినతి

గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యేకు సర్పంచ్‌ల వినతి

📰 Generate e-Paper Clip

*గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యేకు సర్పంచ్‌ల వినతి*

*పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో సమావేశం.. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని పవార్ రామారావు పటేల్ హామీ*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో ముధోల్ నవంబర్ 25:-
ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వానల్ పహాడ్, మలేగాం, ఎగ్గం, పాంగ్ర, అర్లి గోడిసేర, సావ్లీ, టాక్లీ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.