కోదాడలో మార్నింగ్ వాక్ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి.
కోదాడ టౌన్, నవంబర్ (ప్రజావాణి న్యూస్):
వరంగల్–ఖమ్మం–నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మంగళవారం కోదాడ పట్టణ పరిధిలోని పలు మైదానాల్లో మార్నింగ్ వాక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు వాకర్స్, యువత మరియు పట్టభద్రులను నేరుగా కలుసుకుని మాట్లాడారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలన, నిరుద్యోగులు మరియు విద్యావంతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు, నిరుద్యోగులు, యువత విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు. తమ అమూల్యమైన ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

