📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రధాన లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రధాన లక్ష్యం

📰 Generate e-Paper Clip

*జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రధాన లక్ష్యం*

*డిసెంబర్ 1న నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభకు మున్సిపల్ వైస్ చైర్మన్‌కు ఆహ్వానం*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 23:–
జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన భద్రత, హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిరంతరం కృషి చేస్తోందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య పేర్కొన్నారు. డిసెంబర్ 1న నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని జిల్లా యూనియన్ నాయకులు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహాసభ ఆహ్వాన పత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల సేవలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం, వృత్తిపరమైన భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని ప్రస్తావిస్తూ, జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు మున్సిపల్ పాలకవర్గం తరఫున తగిన సహకారం అందించాలని వైస్ చైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్ముల అశోక్, కార్యదర్శి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.