📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవిద్యారంగ సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం

విద్యారంగ సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం

📰 Generate e-Paper Clip

విద్యారంగ సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం : ఏఐఎస్ఏ జాతీయ కార్యదర్శి ప్రసంజిత్ కుమార్ కుమార్

ప్రజావాణి, నవంబర్ 23

హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ: విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త పోరాటాలు నిర్వహిస్తున్నామని పాలకుల విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ కార్యదర్శి ప్రసంజిత్ కుమార్ పిలుపునిచ్చారు.
సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో ఏఐఎస్ఏ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగాన్ని విస్మరిస్తుందని, జాతీయ విద్యా విధానం పేరుతో పాఠ్యాంశాలలో మూడో విశ్వాసాలను పెంపొందిస్తుందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తుందని, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా పోరాటం తో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, కేంద్ర బడ్జెట్ లో మాత్రం ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించడం లేదని, ప్రశ్నించే వారిని అణచివేత ధోరణిని ప్రదర్శిస్తుందని, బిజెపి ప్రభుత్వ విధానంతో విద్యారంగం సంక్షోభంలో ఉందని, జాతీయ విద్యా విధానంతో చదువును కొందరికి పరిమితం చేసేలా ఉందని, సామాన్యులకు ఉన్నత విద్యను దూరం చేస్తుందని, యూనివర్సిటీలో ప్రవేశాలు తగ్గుతున్నాయని విభాగాలు మూతపడుతున్నాయని, పరిశోధన అవకాశాలు కుదించుకోబోతున్నాయని, చదువు భారాన్ని బిజెపి ప్రభుత్వం విద్యార్థుల భుజాలపైకి నెడుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థుల సమస్యలు అనేకం ఉన్నాయని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని, విద్యార్థులను ఫీజులు కట్టాలని కాలేజీల యజమాన్యాలు వేధిస్తున్నాయని, ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో ఇంటర్ బోర్డును రద్దు చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని పాలకుల విధానాలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ మహాసభలలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ఏఐఎస్ఏ కమిటీ సభ్యులు జి,వేమన, రాష్ట్ర కన్వీనర్ జమ్మి అశోక్, కో కన్వీనర్స్ డి.తిరుపతి, చరణ్, బందు సుజాత, స్వాతి, సాయికుమార్, విఠల్, లతో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.