*పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.*
నసురుల్లాబాద్ నవంబర్ 23(ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం పి ఎం. ఆర్ ఏ హెచ్ ఏ టి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సూచించారు.
*రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పీఎం ఆర్ ఏ హెచ్ ఏ టి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.*
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఆర్ ఏ హెచ్ టి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా ₹1.5 లక్షల వరకు, గరిష్టంగా 7 రోజుల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించే అవకాశం ఉంది, పథకం నిబంధనలకు లోబడి.
తెలంగాణ రాష్ట్రంలో పి ఎం ఏ హెచ్ ఏ టి కింద 469 ఆసుపత్రులు నమోదు అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ దవాఖానలు కలవు.
*పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు:*
– ₹1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స.
– గరిష్టంగా 7 రోజుల వరకు చికిత్స, పథకం నిబంధనలకు లోబడి.
– ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం.
– చికిత్స ఖర్చుల భయంతో వైద్య సహాయం ఆలస్యం చేయకుండా ఉండేందుకు ఉపయోగకరమైన పథకం.
ప్రజలకు విజ్ఞప్తి:
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను వెంటనే సమీపంలోని అర్హత కలిగిన ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందేలా చూడండి. అత్యవసర సహాయం కోసం *112* నంబర్‌కు కాల్ చేయండి. ఈ పథకం గురించి ప్రజలందరూ అవగాహన కలిగి ఉండి, అవసరమైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి అక్కడ ఉన్న సిబ్బంది కి పథకం కింద అడ్మిషన్ చేయమని కోరాలి. 48 గంటల్లోపు ఎఫ్ఐఆర్ నమోతే ఈ పథకం కింద లభ్యం పొందవచ్చుని ఎస్సై ఆర్ సాయి కృష్ణ తెలిపారు
*

