బోడ కిషోర్ మృతి పట్ల పాపిశెట్టి శ్రీధర్ తీవ్ర దిగ్భ్రాంతి.. పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు!
హసన్‌పర్తి, నవంబర్ 23, మన ప్రజావాణి :
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66వ డివిజన్ ఇందిరా కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోడ కిషోర్ సోమవారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 66వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ వారి నివాసానికి చేరుకుని బోడ కిషోర్ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా పాపిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. బోడ కిషోర్ పార్టీలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అందరితో కలివిడిగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొని బోడ కిషోర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
