బాధిత కుటుంబానికి కొండంత అండగా తాళ్లూరి గంగాధర్
ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం.. తండ్రి ఆశయాల బాటలో మానవ సేవ
డోర్నకల్, నవంబర్ 23 (ప్రజావాణి)
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్;
కష్టాల్లో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ తాళ్లూరి గంగాధర్ మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామపంచాయతీ పరిధిలోని సత్య తండాకు చెందిన బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
సత్య తండాకు చెందిన ఉపేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తాళ్లూరి గంగాధర్ వెంటనే స్పందించి, తన తండ్రి పేరిట నిర్వహిస్తున్న తాళ్లూరి బాబు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.. పదవులు, హోదాల కంటే ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని తన సేవా కార్యక్రమాల ద్వారా చాటుతున్నారు. తన తండ్రి తాళ్లూరి బాబు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తూ సేవా మార్గంలో పయనిస్తున్నారు.
ఆపద సమయంలో అందించే చిన్న సహాయం సైతం బాధిత కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, వారి కన్నీళ్లు తుడవడం, ఆ కుటుంబాలకు భరోసా కల్పించడమే నిజమైన సేవ అనే సందేశాన్ని తాళ్లూరి గంగాధర్ తన సేవా కార్యక్రమాల ద్వారా చాటుతున్నారు.

