బొడ్రాయి నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందించిన అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి
నవంబర్ 23 ప్రజావాణి న్యూస్/గీసుకొండ
గట్టి కింద పల్లెలో బొడ్రాయి నిర్మాణం
గీసుకొండ మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గట్టు కింద పల్లెలో బొడ్రాయి నిర్మాణం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకురాలు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళంగా అందించారు.ఈ మేరకు హైదరాబాద్లో రాంపూర్ గ్రామ వాస్తవ్యులు, గీసుకొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్ లక్ష రూపాయల నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, మనుగొండ గ్రామ సర్పంచ్ పేర్ల శ్రవణ్, మనుగొండ గ్రామ వార్డు సభ్యులు యాగోని రజనీకాంత్, తుప్పరి ఉదయ్, చిరంజీవి, బిక్షపతి, పాకనాటి మధు, సాయిలి మధు, బోయ అశోక్, దౌడు రాజేష్, బోడ హరి నాయక్, బాదావత్ లాల్ సింగ్, సాయిలి నరేందర్తో పాటు ఉపసర్పంచ్ పులి సూరయ్య, పులి కోర్నేలు, పులి సుధాకర్, పులి రవి, చిలుపురి రవి, పులి రవీందర్, పులి శంకర్, పులి మల్లయ్య, పులి రాజేష్, పులి రాజు, పులి చిరంజీవి, పులి రమేష్, పులి సాంబయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

