📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసొమ్ము కేంద్రానిది.. స్టిక్కర్లు బీఆర్ఎస్‌వా? కేటీఆర్‌కు గంట రవికుమార్ ఘాటు కౌంటర్

సొమ్ము కేంద్రానిది.. స్టిక్కర్లు బీఆర్ఎస్‌వా? కేటీఆర్‌కు గంట రవికుమార్ ఘాటు కౌంటర్

📰 Generate e-Paper Clip

**సొమ్ము కేంద్రానిది.. స్టిక్కర్లు బీఆర్ఎస్‌వా? కేటీఆర్‌కు గంట రవికుమార్ ఘాటు కౌంటర్!**

వరంగల్ నగర అభివృద్ధిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

భద్రకాళి బండ్, వైకుంఠధామాలు, సైకిల్ ట్రాక్, రీజనల్ లైబ్రరీ, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు అందాయని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పేరుతో ప్రచారం చేసుకుందని ఆరోపించారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్ అభివృద్ధి కుంటుపడిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు.

వరంగల్ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నది బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అబద్ధపు ప్రచారాలతో ఓరుగల్లు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని గంట రవికుమార్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.