సొమ్ము కేంద్రానిది.. స్టిక్కర్లు బీఆర్ఎస్వా? కేటీఆర్కు గంట రవికుమార్ ఘాటు కౌంటర్
**సొమ్ము కేంద్రానిది.. స్టిక్కర్లు బీఆర్ఎస్వా? కేటీఆర్కు గంట రవికుమార్ ఘాటు కౌంటర్!** వరంగల్ నగర అభివృద్ధిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భద్రకాళి బండ్, వైకుంఠధామాలు, సైకిల్ ట్రాక్, రీజనల్ లైబ్రరీ, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ...