గూనిపర్తిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు
ప్రజావాణి నవంబర్ 23
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన ఆన్లైన్ నమోదు ప్రక్రియను గ్రామ సర్పంచ్ బుర్ర రాధిక కరుణాకర్ దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో ఆమె స్వయంగా పాల్గొని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత వివరాలను నమోదు చేయించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా గ్రామస్థులకు అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ, గ్రామ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

