మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22
మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేతావత్ తండాకు చెందిన ఆర్. శీను ని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇతర క్షతగాత్రులను కూడా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న వైద్యులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన చికిత్సను అందుబాటులో ఉంచాలని సూచించారు.
బాధితులకు ప్రభుత్వం తరఫున అవసరమైన వైద్య సహాయ సహకారాలు అందేలా చూడాలని వైద్య సిబ్బందిని కోరారు.
ఈ కార్యక్రమంలో సీతారాం నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

