📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారి సమీక్ష - అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోవద్దు

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారి సమీక్ష – అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోవద్దు

📰 Generate e-Paper Clip

*ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారి సమీక్ష – అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోవద్దు*

మంచిర్యాల,ప్రజావాణి రిపోర్టర్,నవంబర్ 22:

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారి సమీక్ష – అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోవద్దు
సారాంశం
అర్హులైన ఓటర్లెవరూ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
ముఖ్య విషయాలు
శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
అర్హులైన ఓటర్లెవరూ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.
ఇప్పటికే ప్రచారం చేసినప్పటికీ దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన అర్హులైన ఓటర్లను గుర్తించి, వారికి మరోసారి అవగాహన కల్పించాలని తెలిపారు.
జాబితాలో ఉన్నప్పటికీ నివాసం మారని ఓటర్లు నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించవలసిన అవసరం లేదని, నివాసం మారిన వారు మాత్రం ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అనాక్సర్-సి సమర్పించాలని వివరించారు.
మంచేరియల్, 2026-11-21

అర్హులైన ఓటర్లెవరూ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

అర్హులైన ఓటర్లెవరూ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, నివాసం మారిన (షిఫ్టెడ్), అందుబాటులో లేని (అబ్సెంట్) ఓటర్ల విషయంలో బూత్ స్థాయి అధికారులు ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి సంబంధిత ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అర్హులైన ఓటర్లు ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటు హక్కు పునరుద్ధరణకు లభించిన ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా రాజకీయ పార్టీలు, మీడియా, బూత్ స్థాయి ఏజెంట్లు, బూత్ స్థాయి అధికారుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ప్రచారం చేసినప్పటికీ దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన అర్హులైన ఓటర్లను గుర్తించి, వారికి మరోసారి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎ.ఎస్.డి.డి. జాబితాలో ఉన్నప్పటికీ నివాసం మారని ఓటర్లు నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించవలసిన అవసరం లేదని, నివాసం మారిన వారు మాత్రం ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అనాక్సర్-సి సమర్పించాలని వివరించారు. ఈ ప్రక్రియపై సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ స్థాయి అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేలా పర్యవేక్షించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 1 లక్ష 14 వేల 468 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని సింగరేణి ప్రాంతాలలో ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు బదిలీ కావడం, ప్రజలు నివాసాలు మారడం వంటి కారణాలతో షిఫ్టెడ్ ఓటర్ల సంఖ్య అధికంగా ఉందని, మరణించిన ఓటర్లకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలను అనుబంధ జాబితాతో సహా ముద్రించి, మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, వాస్తవ వివరాలను నిర్ధారిస్తామని తెలిపారు. ముసాయిదా జాబితా అనంతరం క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ సమయంలో పేర్లు తొలగించబడిన కొందరు ఓటర్లు ఫారం-6 సమర్పించారని, వాటికి సంబంధించిన వివరాలను మరోసారి పరిశీలించి, అర్హులైన వారి పేర్లను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేకంగా బెల్లంపల్లి, మంచిర్యాల, క్యాతనపల్లి, మందమర్రి పట్టణ ప్రాంతాలలో సింగరేణి ఉద్యోగుల బదిలీలు, నివాస మార్పుల కారణంగా ఓటర్ల వివరాలలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల రాజస్వ మండలాధికారి శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.