తెలంగాణలో పదో తరగతి (SSC) ఒరిజినల్ సర్టిఫికెట్లలోని పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాల సవరణకు విద్యాశాఖ ఆఫ్లైన్ దరఖాస్తులను నిలిపివేసింది. ఇకపై విద్యార్థులు మీ సేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులు సంబంధిత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ, డీఈఓల పరిశీలన అనంతరం ప్రభుత్వ పరీక్షల విభాగం తుది అనుమతికి వెళ్తాయి. ఆమోదం లభించగానే సవరించిన మెమో ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది. భౌతిక దరఖాస్తులు స్వీకరించవద్దని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

