📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవెంకటాపూర్ మండలంలో కలకలం

వెంకటాపూర్ మండలంలో కలకలం

📰 Generate e-Paper Clip

వెంకటాపూర్ మండలంలో కలకలం

నకిలీ సంతకాలతో ప్రభుత్వ నిధులు డ్రా?
లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీలో ఫోర్జరీ ఆరోపణలు

ములుగు జిల్లా ప్రతినిధి (,ప్రజావాణి)

ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీలో నకిలీ సంతకాలతో బిల్లులు చెల్లించి ప్రభుత్వ నిధులు డ్రా చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులపై ప్రజాప్రతినిధుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

*తీర్మానాలు లేకుండానే బిల్లులా?*

ప్రజాప్రతినిధులకు తెలియకుండానే వారి సంతకాలను పోలి ఉండేలా బిల్లులపై సంతకాలు చేసి చెల్లింపులకు పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రామసభ తీర్మానాలు లేకుండా బిల్లులు ఎలా తయారయ్యాయి? సంతకాలు చేయకుండానే చెల్లింపులు ఎలా జరిగాయి? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయి బిల్లులు చెల్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*రికార్డులు స్వాధీనం చేసుకోవాలి*

పంచాయతీ తీర్మానాలు, బిల్లులు, మెజర్‌మెంట్ బుక్కులు, బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

బిల్లులపై ఉన్న సంతకాలను ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

*బాధ్యులపై చర్యలు తీసుకోవాలి*

ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్నా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై పూర్తి విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.