వెంకటాపూర్ మండలంలో కలకలం

వెంకటాపూర్ మండలంలో కలకలం నకిలీ సంతకాలతో ప్రభుత్వ నిధులు డ్రా? లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీలో ఫోర్జరీ ఆరోపణలు ములుగు జిల్లా ప్రతినిధి (,ప్రజావాణి) ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీలో నకిలీ సంతకాలతో బిల్లులు చెల్లించి ప్రభుత్వ నిధులు డ్రా చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులపై ప్రజాప్రతినిధుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. *తీర్మానాలు లేకుండానే బిల్లులా?* ప్రజాప్రతినిధులకు తెలియకుండానే వారి సంతకాలను పోలి ఉండేలా బిల్లులపై సంతకాలు...