📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజె వి వి ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్

జె వి వి ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్

📰 Generate e-Paper Clip

జె వి వి ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్

ప్రజావాణి,ఇనుగుర్తి : మండల కేంద్రం ఇనుగుర్తి లోని జడ్పీహెచ్ఎస్ లో శనివారం జన విజ్ఞాన వేదిక ( జె వి వి )ఇనుగుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ – 2026 ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల చెందిన విద్యార్థులు పాల్గొని పరీక్షను రాశారు. అంతకుమునుపుఎంఈఓ వెన్న వెంకట్ రెడ్డి చేతుల మీదుగా క్వశ్చన్ పేపర్ విడుదల చేశారు. దీనికి ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, స్థానిక హెచ్ఎం అమ్మ యాకయ్య,జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు దార్ల భాస్కర్,ప్రధాన కార్యదర్శి,ఆది చందు,గౌరవ అధ్యక్షులు చిన్నాల కట్టయ్య,గంజి వీరేందర్ రెడ్డి,కోశాధికారి,గాడుదుల గణేష్_, సమత కన్వీనర్,పొన్నం కవిత,చెకుముకి కన్వీనర్ వేముల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, ప్రశ్నించే తత్వం పెంపొందించడమే చెకుముకి ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. పిల్లలు బట్టీ పట్టడం కాదు, అర్థం చేసుకుని ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఎం. మాధవ్, యాదగిరి, ప్రవీణ్ కుమార్, డి. శాలిని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.