చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలి
ఎస్.వి.పి. సూర్య చంద్రకళ
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో *21.11.2026 (శనివారం) న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ఎస్.వి.పి. సూర్య చంద్రకళ గారు తెలిపారు.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (NI Act) చట్టం కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన కక్షిదారులు, ఫిర్యాదుదారులు మరియు ప్రతివాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌కు హాజరై పరస్పర అంగీకారంతో తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.
కోర్టుల చుట్టూ తిరగకుండా, సమయం మరియు ఖర్చు ఆదా చేసుకుంటూ సత్వర న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ ఒక మంచి వేదిక అని ఆమె తెలిపారు. కావున సంబంధిత కేసుల కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

