📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు

సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు

📰 Generate e-Paper Clip

సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు

కల్లెపెల్లి విజయసాగర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 20

ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పేదలకు అండగా నిలుస్తూ విశేష సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన కల్లెపెల్లి విజయసాగర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సేవలను గుర్తించిన జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన విజయసాగర్, తన సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. ఆలయ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచితంగా గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు నేత్రదానం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి కృత్రిమ కాళ్ల తొడుగులు, ఉచిత మందులు పంపిణీ చేస్తూ పేదలకు అండగా నిలిచారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో తనవంతు కృషి చేశారు.

ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించిన జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ అబ్రహం పాల్, డాక్టర్ బెన్ స్టోర్క్, డాక్టర్ లియోన్, డాక్టర్ ఎమిలే, డాక్టర్ ఎలిజబెత్ చేతుల మీదుగా విజయసాగర్ ఈ డాక్టరేట్‌ను అందుకున్నారు.

ఈ సందర్భంగా విజయసాగర్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువై విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎం. దైవాజ్ఞ శర్మ, సినీ నటుడు దొరైస్వామి, వేములవాడ రాజకుమార్, టీవీ వ్యాఖ్యాత శిల్పిక, మహిళా సేవా సమితి అధ్యక్షురాలు జ్యోతి, మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.