📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపుస్తక పఠనంతోనే విజ్ఞానం.. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి

పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి

📰 Generate e-Paper Clip

పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి

విద్యార్థులకు గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో అతిథుల సూచన

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 20:

పుస్తక పఠనాన్ని అలవర్చుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పలువురు అతిథులు విద్యార్థులకు సూచించారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆరు రోజులపాటు నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కవిత మాట్లాడుతూ.. ప్రస్తుత యువత, విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని అన్నారు. ఆ సమయాన్ని గ్రంథాలయాల్లో పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు.

మరో ముఖ్య అతిథి డీఎల్‌పీవో అధికారి దేవిక మాట్లాడుతూ.. విజ్ఞానం సముద్రం వంటిదని, ఎంత నేర్చుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఖాళీ సమయాన్ని గ్రంథాలయాల్లో గడుపుతూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం. కనకలక్ష్మి మాట్లాడుతూ.. కేవలం రూ.100 సభ్యత్వ రుసుము చెల్లించి గ్రంథాలయ సభ్యత్వం పొందవచ్చని తెలిపారు. సభ్యులు తమకు నచ్చిన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి చదువుకోవచ్చని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని వివరించారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ సహకారంతో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనంలో మహిళలు, పురుషులు, చిన్నారుల కోసం ప్రత్యేక పఠన గదులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పోటీల్లో విజేతలకు బహుమతులు

వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగోలి పోటీల్లో గాయత్రీ పాఠశాలకు చెందిన మహాలక్ష్మి, షణ్ముఖప్రియ ప్రథమ బహుమతి సాధించగా, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సాయి వీక్షణి, లక్ష్మీ ప్రసన్న ద్వితీయ బహుమతి పొందారు. కన్సొలేషన్ బహుమతులను గాయత్రీ పాఠశాలకు చెందిన సింధు, అమృత అందుకున్నారు.

మెహందీ పోటీల్లో గాయత్రీ విద్యాసంస్థలకు చెందిన షబ్నం అంజుమ్ ప్రథమ బహుమతి సాధించగా, రైజింగ్ సన్ పాఠశాలకు చెందిన నాబియా ద్వితీయ బహుమతి పొందారు. కన్సొలేషన్ బహుమతిని ఆయిషా సిద్ధిఖీ, రెండో కన్సొలేషన్ బహుమతిని గాయత్రీ పాఠశాలకు చెందిన షాన్వి అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ గఫార్ ఆధ్వర్యం వహించగా, పెద్దపల్లి సీఆర్పీలు బాలసాని వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు సహకరించారు. జిల్లా గ్రంథాలయ గ్రంథపాలకుడు యూనుస్ ఖాద్రి, గ్రంథపాలకురాలు బి. కవిత, గ్రంథాలయ సిబ్బంది చి. స్వరూప, షేర్ ఖాన్, జి. సదానందం, ఆర్. సంపత్, ఎం. సంపత్ కుమార్, కె. శ్రీనివాస్, వివిధ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, పాఠకులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.