పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి
పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి విద్యార్థులకు గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో అతిథుల సూచన ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 20: పుస్తక పఠనాన్ని అలవర్చుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పలువురు అతిథులు విద్యార్థులకు సూచించారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆరు రోజులపాటు...