📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపెన్షన్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనం బట్టబయలు.

పెన్షన్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనం బట్టబయలు.

📰 Generate e-Paper Clip

పెన్షన్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనం బట్టబయలు.

4.70 లక్షల పాత పెన్షన్లు తొలగించి 4.63 లక్షల కొత్త పెన్షన్లా ?

కొత్త పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తోంది.

పెన్షన్ల పేరుతో ప్రజాధనం వృథా లబ్ధిదారులకు ఎదురుచూపులేనా?

బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ధరావత్ సురేష్.

బాన్సువాడ/ప్రజావాణి:-రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చందూర్ మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ధరావత్ సురేష్ నాయక్ విమర్శించారు.శుక్రవారం ఆయన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత మూడేళ్లలో సుమారు 4 లక్షల 70 వేల పాత పెన్షన్లను తొలగించి,ఇప్పుడు మూడేళ్ల తర్వాత 4 లక్షల 63 వేల కొత్త పెన్షన్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, మరోవైపు సుమారు 7 వేల పెన్షన్లను తగ్గించిందని ఆరోపించారు.పెన్షన్ల మంజూరు పేరుతో గ్రామగ్రామాన సభలు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆయన విమర్శించారు.తొలుత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న పెన్షన్ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించి,అనంతరం నవంబర్ 26న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తామని వాయిదా వేయడంపై ఆయన ప్రశ్నించారు.
ముందుగా ప్రొసీడింగ్ లెటర్లు అందించి ఆ తర్వాత మరో సభ నిర్వహించి నిధులు విడుదల చేస్తామని ప్రకటించడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందన్నారు.ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించాలని,తొలగించిన పాత పెన్షన్లపై స్పష్టత ఇవ్వాలని ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.