📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణముంగిమడుగు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన

ముంగిమడుగు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన

📰 Generate e-Paper Clip

ముంగిమడుగు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన*
ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 20 :
*క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్ నమోదు తీరును పరిశీలించిన ఎంపీడీఓ అంజలి*

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న బీమా దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఎంపీడీఓ అంజలి క్షేత్రస్థాయిలో పరిశీలించారు

ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాల వివరాల నమోదు, ఆన్‌లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ బీమా పథకం ప్రయోజనాలు అందేలా నమోదు ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు..

ఈ యొక్క కార్యక్రమం లో సర్పంచ్ దొంతు శారదారవి, ఉపసర్పంచ్ దొంతు మహేష్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యిన MPDO అంజలి గారు కార్యక్రమం లో కార్యదర్శి నివాస్ రెడ్డి గారు, వార్డు మెంబెర్స్ దొంతు యాదలక్ష్మి, లలిత, హల్యమ్మ, కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు నాగముని, దొంతు మమతా,గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు,మహిళలు పలుగున్నరు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.