*సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికీ సర్పంచ్ పాలాభిషేకం*
జహీరాబాద్, నవంబర్ 20 (ప్రజావాణి): ఇందిరమ్మ భీమాతో 60 సం రాల లోపు ఉన్నవారి జీవితానికి ధీమా అని, కులమాత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి రేవంత్ సర్కార్ అందజేయడం శుభపరిణామం అని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమలు అమలు కానున్నాయని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. కోహిర్ మండలంలోని మనియర్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ భీమా పత్రాలను పంపిణి గ్రామ సర్పంచ్ బ్యాగారి రాజ్ కుమార్ గ్రామ ప్రజలకు పంపిణి చేశారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాజ్ కుమార్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి ఉపాధి హామీ పనులపై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అమలు అవుతున్న ఉపాధి హామీ పథకాన్ని అట్టడుగు వర్గాల వారికీ అందేవిధంగా సిబ్బంది చూడాలని అన్నారు. తదుపరి గ్రామంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

