జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కొలుకొండ గ్రామంలో వినాయక ఫంక్షన్ హాల్లో పాలకుర్తి మండలం, శాతపురం గ్రామ సర్పంచ్ లోనే శ్రీనివాస్ కుమార్తె కల్యాణి, ప్రశాంత్‌ల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా, శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ఆమెకు వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు కల్యాణి – ప్రశాంత్‌లను ఆప్యాయంగా ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. నూతన జంట అన్యోన్య దాంపత్యంతో, ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు, వైటిడిఏ మెంబెర్ డాక్టర్.లకావత్ లక్ష్మీ నారాయణ నాయక్, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగు శ్రీనివాస్, దావేర అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

