📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

📰 Generate e-Paper Clip

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి):జిల్లా లోని పాలకుర్తి మండలం, మల్లంపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు పూర్మ రఘుపాల్ రెడ్డి కుమారుడి వివాహ మహోత్సవం హైదరాబాద్, నాగోల్‌లోని ఈషా గార్డెన్‌లో అత్యంత వైభవంగా, శుక్రవారం జరిగింది.

ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో, అన్యోన్య దాంపత్యంతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు. వారి వైవాహిక జీవితం ఆనందాలతో నిండాలని, కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వివాహ వేడుకకు బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.