📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్కస్తూర్బా విద్యార్థినులకు రక్షణ ఏదీ?

కస్తూర్బా విద్యార్థినులకు రక్షణ ఏదీ?

📰 Generate e-Paper Clip

రూ.18 లక్షల నిధులున్నా ప్రహరీ గోడ నిర్మాణం శూన్యం

విద్యార్థుల భద్రతపై సీపీఐ ఆందోళన..

బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా బెజ్జంకికస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థినులకు భద్రత కరువైందని సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, సహాయ కార్యదర్శి సంగెం మధు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా కూలిపోయిన ప్రహరీ గోడను నిర్మించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూర్బా, మోడల్ స్కూల్ ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.18 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల మధ్య వర్గపోరు, సమన్వయ లోపంతో విద్యార్థినుల భద్రత గాలిలో కలిసిందన్నారు. పాఠశాల ఆవరణలోకి పందులు, పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల భద్రతను నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తల్లిదండ్రులతో కలిసి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.