కస్తూర్బా విద్యార్థినులకు రక్షణ ఏదీ?
రూ.18 లక్షల నిధులున్నా ప్రహరీ గోడ నిర్మాణం శూన్యం విద్యార్థుల భద్రతపై సీపీఐ ఆందోళన.. బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకికస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థినులకు భద్రత కరువైందని సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, సహాయ కార్యదర్శి సంగెం మధు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా కూలిపోయిన ప్రహరీ గోడను నిర్మించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూర్బా, మోడల్ స్కూల్ ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.18 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల మధ్య వర్గపోరు, సమన్వయ...