📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసింగరేణి మనుగడను కాపాడాలి

సింగరేణి మనుగడను కాపాడాలి

📰 Generate e-Paper Clip

*సింగరేణి మనుగడను కాపాడాలి*

*60 వేల కోట్ల బకాయిలను వెంటనే సింగరేణికి చెల్లించాలి*

*కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యం*

*ఎస్సిడబ్ల్యూయు (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ లు*

* *మన ప్రజావాణి మందమర్రి:-*

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం మొండి బకాయిలు చెల్లించకపోవడం వల్ల సింగరేణి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, సింగరేణి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే బకాయిలు చెల్లించి, సింగరేణి మనుగడను కాపాడాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు డిమాండ్ చేశారు. సింగరేణి పై రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి నిరసనగా, డిమాండ్ల సాధనకు ఏఐటీయూసీ ఇచ్చిన పిలుపుమేరకు రెండు రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా రెండవ రోజు గురువారం సైతం యూనియన్ ఆధ్వర్యంలో ఏరియా జిఎం కార్యాలయం ఎదుట యూనియన్ బెల్లంపల్లి – ఆర్కేపీ బ్రాంచ్ ల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు హాజరై, యూనియన్ నాయకులకు పూలమాలవేసి, దీక్షను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సింగరేణికి చెల్లించవలసిన 60 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, మొండి బకాయిలతో సింగరేణి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ గనులకు అవసరమైన సేఫ్టీ మెటీరియల్స్, షవల్స్, డంపర్లు, డోజర్లు, ఇతర యంత్ర పరికరాలను నిధుల లేమి కారణంగా యాజమాన్యం కొనుగోలు చేయలేకపోతుందన్నారు. ప్రస్తుతం ఉన్న యంత్రాలు తరచు మరమ్మతులు గురవుతుండటంతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి కష్టతరంగా మారిందని, ఇది సింగరేణి భవిష్యత్తుకే గొడ్డలి పెట్టు అని తెలిపారు. కార్మిక సమస్యలు పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం పాటు అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు నిర్వహించే మెడికల్ బోర్డును వంద శాతం ఇన్ వ్యాలిడేషన్ తో నిర్వహించాలని, వివిధ కారణాలతో డిస్మిస్ అయిన కార్మికులందరినీ ఇలాంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకొని విధులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్ఎల్సి సమక్షంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేసుకున్న చేసుకున్న 24 ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలన్నారు. నేటి దీక్షలకు యూనియన్ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, రిటైర్డ్ కార్మిక సంఘం సభ్యులు, జిఎం కార్యాలయం మహిళ పిట్ కమిటీ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి, కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ ఆలీ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, ఆర్కేపి ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, బెల్లంపల్లి ఉపాధ్యక్షుడు బియ్యాల వెంకటస్వామి, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, పిట్ కార్యదర్శులు హరి రామకృష్ణ, గొల్ల శ్రీనివాస్, రత్నం ప్రవీణ్ కుమార్, ఓద్దమల్ల రాజేందర్, మీనుగు లక్ష్మీనారాయణ, జెట్టి మల్లయ్య, మంతెన రమేష్, చిప్పరి శ్రీహరి, ఎండి సిరాజ్, మండల శ్రీనివాస్, పి సురేష్,ఏ సందీప్, జాడి రమేష్, బొద్దుల వెంకటేష్, బొమ్మకంటి సాగర్, మాదాసు వేణుగోపాల్, రంజిత్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.