*ఉన్నత విద్య కోసం ఆపన్న హస్తన్ని అందించిన కే ప్రసాద్ రెడ్డి*
*నర్సింగ్ విద్యకు పూర్తి తోడ్పాటు అందించుటకు హామీ*
*సహకరించిన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి*
జహీరాబాద్, నవంబర్ 19 (ప్రజావాణి): సంపాదనలో కొద్దీ మొత్తం సామజిక సేవల్లో పెట్టాలనే సంకల్పంతో ముందుకు వచ్చి తన స్వగ్రామం నుంచి సామజిక కార్యక్రమలను మొదలుపెట్టి మండలంలోని పలు గ్రామాల్లో ఓపెన్ మురికి కాలువల వల్ల విఫరితమైన దుర్గాంధంతో ఈగలు, దోమలు ప్రబలి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించి తన సొంత ఖర్చులతో ఓపెన్ డ్రైనేజిలను అండర్ డ్రైనేజిగా మారుస్తూ ప్రజల మన్ననలు పొందిన ప్రముఖ పరిశ్రమిక వేత్త, అసెంబ్లీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుడిముస్కుల ప్రసాద్ రెడ్డి బుధవారం నాడు జహిరాబాద్ మండలంలోని తుంకుంట గ్రామానికి చెందిన జి అక్షయ తండ్రి జి మొగులయ్య ఎస్సీ సామజిక వర్గానికి చెందిన విద్యార్థి బిఎస్సీ నర్సింగ్ చదువుకు ఆర్థిక కష్టలు అడ్డంకిగా మరడంతో నేరుగా తనని సంప్రదించిన విద్యార్థికి కాలేజీ ఫీజు నిమిత్తం అవసరం అయినా 45 వెయ్యిలను చెల్లించి ఎట్టి పరిస్థితుల్లో చదువును ఆపడానికి విల్లెదని విద్యార్థినికి భరోసా ఇచ్చారు. తన ఫీజు నిమిత్తం 45 వెయ్యిలు చెల్లించిన కే ప్రసాద్ రెడ్డి కీ విద్యార్థి అక్షయ కృతజ్ఞతలు తెలియజేస్తూ తనలాంటి ఎంతో మంది దళిత విద్యార్థులు డబ్బులు లేక చదువుకు దూరం అవుతున్నారని, తన ఫీజు నిమిత్తం సంప్రదించిన వెంటనే 45 వెయ్యిల రూపాయల సహకారం అందించిన కే ప్రసాద్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అసెంబ్లీ నాయకులు కే ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తన సంపాదనలో పేదవారి కోసం ఖర్చు చేస్తానని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

