*పారిశుధ్య కార్మికులపై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు*
*వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నల్గొండ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులపై జరిగిన దాడిని వివిధ ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లమ్మ మహేష్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాజు నరసింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మికులపై దాడులు జరగడం దారుణమని, కార్మికులకు రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

