రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ
న్యాయం కోసం యువతి నిరాహార దీక్ష
దండేపల్లి, నవంబర్ 19 (ప్రజావాణి ): రెండేళ్లుగా ప్రేమించి, వివాహం చేసుకుంటానని నమ్మించి ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన ఎల్లమధ్రి అనిత (24), దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పాల్తే గౌతమ్ (27)తో గత రెండేళ్లుగా పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలిపింది. ఇద్దరూ ప్రేమించుకున్నామని, వివాహం చేసుకుంటానని నమ్మించిన యువకుడు ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని అనిత ఆరోపించింది.
దీంతో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, తనకు న్యాయం చేయాలని కోరుతూ లింగాపూర్ గ్రామంలోని యువకుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది.

