మహిళా (VO) భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ చింత రవి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో మహిళా (VO) భవన్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది.
VBG రాం జీ ఉపాధి హామీ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కాగా, మహిళా సంఘాల సమావేశం కోసం నిర్మించనున్న ఈ భవన్ నిర్మాణానికి సర్పంచ్ చింత.రవి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రవి మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలకు, శిక్షణ కార్యక్రమాలకు ఈ భవన్ ఎంతో ఉపయోగపడుతుందని, గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ మండల ఎఈ నవ్వ, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ రిజ్వాన్ సిరాజ్, వార్డు సభ్యులు ఎల్లబోయిన గిరియాదవ్, చింత లక్ష్మయ్య, మరాఠీ కొండయ్య, చింత శ్రీను, బిల్లా యాదవరెడ్డి, మరాఠీ మల్లేష్, మొలుగురి యకయ్యా, బెజటి సోమయ్య, దుద్దుల భాస్కర్, ఇదునూరి శేఖర్ రెడ్డి, చింత యాదగిరి, మొలుగూరి మొగులయ్య, పంగ నర్సయ్య, బజ్జూరి భిక్షపతి, చింత యాకస్వామి, ఉపేందర్, శేఖర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

